చలిని సైతం లెక్కచేయకుండా బారులు తీరిన ఓటర్లు
BHPL: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని నాలుగు మండలాల్లో మూడో విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. తీవ్ర చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. వార్డులు ఎక్కువగా ఉన్న చోట ఓటర్లు తమ పోలింగ్ గదులు వెతికి ఇబ్బంది పడ్డారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.