పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు
NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతతో 1,781 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, జీతాల చెల్లింపులు, మెయింటెనెన్స్ పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.