బైకులు ఢీకొని యువకుడి మృతి
ELR: మండవల్లి మండలం చావలిపాడు రైల్వే గేటు వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గేటు పడుతుండగా వేగంగా దాటే క్రమంలో రెండు మోటార్ సైకిళ్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో కైకలూరు మండలం ఆలపాడుకు చెందిన పడమటి సత్యనారాయణ మృతి చెందగా, మాజీ ఏఎంసీ ఛైర్మన్ తలారి వెంకటస్వామికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.