VIDEO: నల్ల పోచమ్మ దేవాలయంలో భారీగా భక్తుల రద్దీ

NZB: ఆర్మూర్ నల్ల పోచమ్మ దేవాలయం వద్ద భారీగా భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ఆషాడమాసం సందర్భంగా పలువురు భక్తులు అమ్మవారికి బోనాలను, ప్రత్యేక నైవేద్యాలను సమర్పించారు. ఇప్పటి వరకు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగనుంది. భక్తులు సామూహిక వనభోజనాలు చేశారు.