VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి

SKLM: కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి సేవలను అడిగి తెలుసుకున్నారు. వార్డులు పరిశీలించిన అనంతరం సిబ్బందితో మాట్లాడారు. సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని అచ్చెన్నాయుడు అన్నారు.