జాతీయ రహదారిపై లారీ బోల్తా

జాతీయ రహదారిపై లారీ బోల్తా

E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు హైవేపై శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న లారీ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంతో తోటి వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి దేవరపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.