VIDEO: బీచ్ క్లీనింగ్‌లో సీపీ
విశాఖపట్నం బీచ్ రోడ్డులో నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి శనివారం స్వయంగా పారిశుధ్య పనుల్లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. వైఎంసీఏ, ఎంజీఎం పార్కు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను ఆయన స్వయంగా ఏరివేస్తూ శుభ్రం చేశారు. కమిషనర్‌తో పాటు పలువురు పోలీసు సిబ్బంది కూడా ఈ క్లీనింగ్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.