పెళ్లి రోజే.. ఉరిశిక్ష తీర్పు
బంగ్లా మాజీ ప్రధాని హసీనాకు ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన ఇవాళ(నవంబర్ 17) ఆమె జీవితంలో మరుపురాని రోజు. ఎందుకంటే ఇదే రోజున ఆమె ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను వివాహం చేసుకున్నారు. వాస్తవంగా ఈ తీర్పును 14న ఇస్తామని కోర్టు తెలిపింది. కానీ ఈ ప్రత్యేక రోజున బంగ్లా కోర్టు తీర్పు ఇచ్చేలా ఉద్దేశపూర్వకంగానే మార్చినట్లు పలువురు మండిపడుతున్నారు.