తిరువూరులో 144 సెక్షన్ అమలు

తిరువూరులో 144 సెక్షన్ అమలు

NTR: తిరువూరులో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని తహసీల్దార్ నాగమణి 144 సెక్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా సమావేశాలు నిర్వహించడం, ప్రదర్శనలు చేయడం, ఐదుగురికి మించి గుమిగూడడం నిషేధించినట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు అమల్లో ఉన్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.