రైతులకు అలర్ట్.. మిగిలినవి రెండు రోజులే..!

రైతులకు అలర్ట్.. మిగిలినవి రెండు రోజులే..!

MBNR: కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు మార్చి 25 లోపు 'రైతు భరోసా'కు దరఖాస్తు చేసుకోవాలని గాండీడ్ మండలం పెద్దవార్వాల్ ఏఈఓ శివలీల తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు పాస్‌బుక్ పొంది, వివరాలు నమోదు చేయని వారు ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలను ఏఈఓకు సమర్పించాలని ఆమె సూచించారు.