చద్దాకు ఆప్ షాక్.. రాఘవ్ గళానికి బ్రేక్

చద్దాకు ఆప్ షాక్.. రాఘవ్ గళానికి బ్రేక్

పార్లమెంటులో తన గళంతో ఆకట్టుకుంటున్న రాఘవ్ చద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. రాజ్యసభ డిప్యూటీ లీడర్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి, ఆ స్థానంలో అశోక్ మిట్టల్‌ను కూర్చోబెట్టింది. చద్దాకు మాట్లాడే సమయం కూడా ఇవ్వొద్దని కోరడం చూస్తుంటే, పార్టీకి ఆయనకు మధ్య విభేదాలు ముదిరినట్లు కనిపిస్తోంది. ఆప్ తీసుకున్న కఠిన నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.