పుష్పగిరిలో వైభవంగా చక్రస్నానం
KDP: పుష్పగిరి పుణ్యక్షేత్రంలో వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. గురువారం పెన్నానది వద్ద కామాక్షి వైద్యనాథేశ్వర, లక్ష్మీ చెన్నకేశవ స్వాముల ఆయుధాలకు వేదమంత్రాల మధ్య చక్రస్నానాలు జరిపారు. త్రిశూల, సుదర్శన చక్రాలకు ఒకేసారి స్నానం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ పవిత్ర సమయంలో స్నానం చేస్తే ముక్కోటి తీర్థాల పుణ్యం లభిస్తుందని అర్చకులు అఖిల్ వివరించారు.