చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్
GNTR: పెనమలూరులో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నిందితుడు లంకాడి వెంకటేష్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కానూరు, పోరంకి ప్రాంతాల్లో మహిళల మెడలో గొలుసులు దొంగిలించిన ఇతడి నుంచి రూ. 5 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బిర్యానీ పాయింట్ నడుపుతూ, ఖాళీ సమయంలో బైక్ నంబర్ ప్లేట్లు మార్చి ఈ దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసులు వెల్లడించారు.