'రైతులు ఆధార్ వివరాలు సవరించుకోవాలి'

కృష్ణా: అన్నదాత సుఖీభవ పథకం లబ్దిదారుల వివరాల పరిశీలనలో భాగంగా 1,244 మంది రైతులు తమ ఆధార్ వివరాలను సవరించుకోవాలని తహసీల్దార్ బి. విజయప్రసాద్ తెలిపారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతులు వెంటనే సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారిని సంప్రదించి, సరైన వివరాలను ఆన్‌లైన్‌లో సరిచేసుకోవాలని సూచించారు.