ఈనెల 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష
JN: జనగాం మండలంలోని చౌడారం తెలంగాణ మోడల్ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సుధీర్ కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. 6వ తరగతి పరీక్ష ఉదయం 10 గంటలకు, 7 నుంచి 10 తరగతుల పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.