ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి వెళ్లి ప్రసవించిన గర్భిణీ

TG: ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి వెళ్లిన మహిళ క్యూలైన్లోనే ప్రసవించింది. వినాయక చవితి సందర్భంగా స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న సమయంలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మహిళను రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు. పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆమెకు వైద్యం అందిస్తున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.