విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎస్పీ
PPM: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీలలో విజేతలకు శుక్రవారం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి బాగా కష్టపడి చదివి, భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.