'లాభాలు ఉండే పంటల సాగుపై దృష్టి పెట్టాలి'
PPM: రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, మార్కెట్‌లో అధిక లాభాలు ఉండే పంటల సాగుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం సాలూరు(M)పెదబోరబందలో రైతులు వేసిన పత్తి పంటను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పత్తితో పాటు వాణిజ్య పంటలు, ఉద్యానపంటలు వెయ్యాలన్నారు.