బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
NLR: వింజమూరు మండలం ఊటుకూరు సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూలి జనార్దన్ రెడ్డి (48) అనే వ్యక్తి మృతి చెందాడు. పని నిమిత్తం ఉదయగిరి వెళ్లి తిరిగి వస్తుండగా, బైక్ అదుపుతప్పి కింద పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.