VIDEO: గంగమ్మకు విశేష పూజలు

CTR: పుంగనూరు పట్టణం బెస్త వీధిలో వెలసిన పురాతనమైన శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే అమ్మవారి శిలా విగ్రహానికి అభిషేకాలు చేసిన అనంతరం కుంకుమ, పసుపు గంధం, వేపాకులతో పాటు పట్టు చీరతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.