పసుకుడి పరిసర ప్రాంతాల్లో ఏనుగులు గుంపు సంచారం
PPM: భామిని మండలంలోని పసుకుడి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న జీడీ, మామిడి, మొక్కజొన్న తోటల్లో గురువారం ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు తెలిపారు. ఈ మేరకు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు తెలియజేశారు. అదేవిధంగా జీడి, మామిడి తోటలకు రైతులు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు.