రాఘవపురం సర్పంచ్ అభ్యర్థిగా కోటమ్మ నామినేషన్

రాఘవపురం సర్పంచ్ అభ్యర్థిగా కోటమ్మ నామినేషన్

KMM: చింతకాని మండలం రాఘవపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి సీపీఐ పార్టీ బలపర్చిన కాంపల్లి కోటమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు తనపై పూర్తి విశ్వాసంతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.