VIDEO: అంబులెన్స్ లేక.. ఆటోలో మృతదేహం తరలింపు
WGL: నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందిన పర్వతగిరి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ మృతదేహాన్ని అంబులెన్స్ అందుబాటులో లేక ఆటోలో స్వగ్రామానికి తరలించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. మృతదేహాలను తరలించేందుకు అంబులెన్స్‌లు లేకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఉచిత అంబులెన్స్‌ను అందుబాటులోకి తెవాలని డిమాండ్ చేశారు.