'జీడి, మామిడి తోటలపై రైతులకు అవగాహన'
VZM: కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో జీడి, మామిడి పంటలపై ఉద్యాన శాఖ అధికారిణి పద్మ ఆధ్వర్యంలో గురువారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం(మన్యం జిల్లా రాస్తకుంటబాయి) ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జీడి, మామిడి తోటలలో కొమ్మ కత్తిరింపు విధానం చీడ పీడ నివారణపై రైతులకు ఆయన వివరించారు.