VIDEO: ఉదయం 8 గంటలైనా వీడని పొగ మంచు
CTR: పుంగనూరు మండలంలో శనివారం ఉదయం నుంచి దట్టమైన పొగ మంచు కురుస్తోంది. 8 గంటలైనా మంచు తెరలు వీడలేదు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రమాదాలు జరగకుండా వాహనాలు జాగ్రత్తగా నడపాలని అధికారులు సూచిస్తున్నారు. చలి తీవ్రత కూడా పెరగడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు.