VIDEO: అదాలత్ జంక్షన్ వద్ద సీపీ ఆకస్మిక తనిఖీ
హన్మకొండ నగరంలో నూతన సంవత్సరం సందర్భంగా నిన్న రాత్రి అదాలత్ జంక్షన్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలను పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆకస్మికంగా పరిశీలించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సుబేదార్ ఇన్స్‌పెక్టర్ రంజిత్ కుమార్ సిబ్బందితో పాల్గొన్నారు.