పంట భూమిలో పోషక విలువలు పెంపొందించాలి

NDL: పంట భూమిలో రైతులు పోషక విలువలు పెంపొందించుకునేలా రసాయన రహిత సేంద్రియ ఎరువులను వాడాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వెలుగోడు మండలంలోని అబ్దుల్లాపురం గ్రామంలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు వీలైనంతవరకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలని సూచించారు.