డాక్టర్ కావాలనుకున్న యువకుడి మృతి..!

డాక్టర్ కావాలనుకున్న యువకుడి మృతి..!

GNTR: ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్‌ ఎయిమ్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన జగదీశ్‌బాబు (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కష్టపడి జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించి, వైద్య సీటు పొందిన జగదీశ్ మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.