రాష్ట్రవ్యాప్త పర్యటనకు విజయ్

తమిళనాడు వ్యాప్తంగా పర్యటనకు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 13న తిరుచ్చి నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. అదే రోజున తిరుచ్చితో పాటు పెరంబలూర్, అరియలూర్, 20న నాగపట్టినం, 27న తిరువళ్లూరు, OCT 4,5 తేదీల్లో కోయంబత్తూరు.. ఇలా 20న మదురై జిల్లాతో పర్యటన ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే విజయ్ పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు.