ఇండిగో సంక్షోభం.. రూ.1,000 కోట్లు నష్టం
ఇండిగో సంక్షోభం కారణంగా ఢిల్లీలో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు రూ.1,000 కోట్లు నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని 'ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ' వెల్లడించింది. విమాన రాకపోకల్లో అంతరాయం వల్ల వ్యాపారులు, పర్యాటకులు, బిజినెస్ ట్రావెలర్స్ రాకపోకలకు అంతరాయం కలిగినట్లు తెలిపింది. గత 10 రోజుల్లో ఢిల్లీ మార్కెట్లలో జనసంచారం దాదాపు 25% తగ్గిందని వివరించింది.