దివ్యాంగులకు బహుమతులు అందజేసిన ఎస్పీ
CTR: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని చిత్తూరు బీసీ భవన్‌లో బుధవారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎస్పీ తుషార్ డూడీ ప్రత్యేక ప్రతిభావంతులకు నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన వారికి బహుమతులు పంపిణీ చేశారు. వారికి తగిన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నరేంద్ర పాడేల్, సాయినాథ్, మేయర్ అముదా పాల్గొన్నారు.