క్షేమంగా స్వదేశానికి చేరుకున్న రాయికల్ వాసులు
JGL: మయన్మార్ దేశంలో సైబర్ నేరగాళ్ల శిబిరాల్లో చిక్కుకున్న రాయికల్ పట్టణానికి చెందిన మోసారపు రాజు, గణేష్ చంద్ర స్వదేశానికి చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 4 నెలల క్రితం మయన్మార్ వెళ్లిన రాజు, కొద్దిరోజులకు చిత్రహింసలు పెడుతున్నారని, రూ.4లక్షలు ఇస్తేనే పంపిస్తామని తన భార్య నవ్యశ్రీకి ఫోన్‌లో తెలిపాడు. అలాగే గణేష్ చంద్ర సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు.