అంబులెన్స్ లోనే ప్రసవం.. తల్లి,బిడ్డ క్షేమం

అంబులెన్స్ లోనే ప్రసవం.. తల్లి,బిడ్డ క్షేమం

ASF: బెజ్జూర్ మండలం ఇప్పలగూడకు చెందిన గర్భిణీకి సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రమవ్వడంతో ఈఎంటీ రమేశ్ యాదవ్, పైలట్ షణ్ముఖ అంబులెన్స్ లోనే ప్రసవం చేశారు. మహిళ మగబిడ్డకు జన్మనివ్వగా, ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.