పింఛన్ల పంపిణీలో జిల్లా టాప్

TPT: జిల్లాలో నిన్న ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ మొదలైంది. తొలిరోజు సాయంత్రం 6 గంటలకు 95.23% మందికి నగదు అందింది. లబ్ధిదారులకు పింఛన్లు చేరవేయడంలో తిరుపతి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా, చిత్తూరు జిల్లాలో 95.07% పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. ఆ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. మిగిలిన వారికి ఇవాళ నగదు అందజేయనున్నారు.