'మదర్ థెరిస్సా జీవితం అందరికీ ఆదర్శం'

KDP: మదర్ థెరిస్సా జీవితం అందరికీ ఆదర్శమని ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ రెడ్డి అన్నారు. పులివెందుల లోని ఇస్లాంపురం ఉన్నత పాఠశాలలో మంగళవారం మదర్ థెరిస్సా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని జాతిని మేల్కొలిపిన వ్యక్తి మదర్ థెరిస్సా అని కొనియాడారు.