VIDEO: భారీ వర్షంతో నేల కూలిన చెట్టు.. తప్పిన ప్రమాదం

BHPL: భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ ప్రయాణ ప్రాంగణం వద్ద శనివారం పెను ప్రమాదం తప్పింది. గత రండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పెద్ద చెట్టు నేలకూలి ఆటోపై పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.