VIDEO: పోలీసులకు, ఎర్రబెల్లికి మధ్య స్వల్ప వాగ్వాదం
MHBD: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తొర్రూరు బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం నామినేషన్ కేంద్రం దిశగా వెళ్తున్న క్రమంలో పోలీసులు, మాజీ మంత్రి ఎర్రబెల్లికి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రచార డీజె సౌండ్ తగ్గించాలని ఎర్రబెల్లిని పోలీసులు కోరారు. ప్రత్యర్థి పార్టీ వాళ్ళు సౌండ్ తగ్గిస్తే తాము కూడా తగ్గిస్తామని పోలీసులకు ఎర్రబెల్లి బదులిచ్చారు.