లైంగిక నేరగాళ్ల షీట్ హోల్డర్లకు కౌన్సెలింగ్

లైంగిక నేరగాళ్ల షీట్ హోల్డర్లకు కౌన్సెలింగ్

కృష్ణా: నందివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఎస్సై కె.శ్రీనివాసు లైంగిక నేరగాళ్ల షీట్ హోల్డర్లకు కౌన్సెలింగ్ శనివారం నిర్వహించారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చట్టపరమైన పరిణామాలపై వారికి అవగాహన కల్పించారు. సన్మార్గంలో జీవించాలంటూ వారికి సూచనలు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.