నగరంలో కల్తీ మాఫియా రాజ్యమేలుతోంది..!
HYD: నగరంలో కల్తీ మాఫియా రాజ్యమేలుతోంది. మనం తీనే ప్రతి పదార్థం కల్తీ అవుతోంది. ఇలాంటి ఘటనే సికింద్రాబాద్ లాలాపేట్‌లోని ఝూన్సీ గోదాంలో చోటుచేసుకుంది. ఈ గోదాంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా రసాయనాలు కలుపుతున్న నలుగురిపై కేసు నమోదైంది.