నిజామాబాద్ ఆకతాయిలపై కఠిన చర్యలు

నిజామాబాద్ ఆకతాయిలపై కఠిన చర్యలు

నిజామాబాద్ నగరంలోని పలు కళాశాలలు, పాఠశాలల వద్ద బాలికలను వెంబడించిన ఆరుగురు ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి కౌన్సెలింగ్ ఇచ్చి సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు. ఆరో స్టేషన్ పరిధిలో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మహిళను ఓ యువకుడు గతంలో వెంబడించగా, కౌన్సెలింగ్ తర్వాత వదిలేశారు. మళ్లీ వేధించడంతో కేసు నమోదు చేశారు.