వాటి కోసం ఏఐని ఎందుకు వాడట్లేదు: సుప్రీం
సైబర్ మోసాల్లో నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసేందుకు AIని ఎందుకు వాడట్లేదని RBIని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిజిటల్ అరెస్టు కేసులపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా వ్యాఖ్యానించింది. ఈ సైబర్ కేసుల్లో సీబీఐ విచారణకు సమ్మతి తెలియజేయాలని బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు సూచించింది.