మంత్రి డోలాకి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే

మంత్రి డోలాకి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే

కోనసీమ: కొత్తపేట నియోజవర్గంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వచ్చారు. ఈ సందర్భంగా రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.