VIDEO: మంచు తెరల మాటున అరకు ప్రకృతి అందాలు
ASR: వేసవి కాలంలో శీతాకాలాన్ని తలపిస్తున్నట్లు అరకులోయ పరిసర ప్రాంతాలలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఇవాళ ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో అరకులోయ పరిసర ప్రాంతాల్లోని పర్వతాలు, కొండలు, గ్రామాలు కనిపించడంలేదు. పక్షుల కిలకిల రావాలు, చల్లటి వాతావరణం అరకు వచ్చిన పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలుగచేస్తోంది.