VIDEO: మరింతగా నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధి: ఎమ్మెల్యే
కోనసీమ: ఆలమూరు మండలంలోని చింతలూరు శ్రీ నుకాంబిక అమ్మవారి ఆలయాన్ని రానున్న రోజులలో మరింతగా అభివృద్ధి చేయనున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. అమ్మవారి ఆలయ సన్నిధిలో నూతనంగా చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి, అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.