నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
MNCL: మందమర్రిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. అందుగులపేట సబ్ స్టేషన్‌లో మరమ్మతుల దృష్ట్యా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జీఎం ఆఫీస్, యాపల్, కేకే 2, ఊరు మందమర్రి, మార్కెట్, ఊరు రామకృష్ణాపూర్, పులిమడుగు, అందుగులపేట, కోటేశ్వరరావుపల్లి, బొక్కలగుట్ట, నార్లాపూర్‌లలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుందన్నారు.