నగదు, మద్యం తరలింపుపై కఠిన చర్యలు: ఏసీపీ నరసయ్య

నగదు, మద్యం తరలింపుపై కఠిన చర్యలు: ఏసీపీ నరసయ్య

WGL: వర్ధన్నపేట పట్టణంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఏసిపి నరసయ్య పోలింగ్ కేంద్రాలు, చెక్‌పోస్టులను పరిశీలించారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అదనపు పోలీస్ బలగాలు మోహరించాలని ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలు కఠినంగా నిర్వహించాలని, నగదు, మద్యం అక్రమ తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.