పిల్లల బలాలు, బలహీనతలు గుర్తించాలి: సీఎం
మన్యం జిల్లాలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడూ ముందుండాలని పిలుపునిచ్చారు. అలాగే విద్యార్థులు ఇష్టపడి చదవాలన్నారు. చదువుతో పాటు ఆట, పాటలు కూడా ఉండాలన్నారు. పిల్లల బలాలు, బలహీనతలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలని సూచించారు.