VIDEO: ప్రిన్సిపల్ వెళ్ళొద్దంటూ విద్యార్థినులు ఆందోళన
కోనసీమ: ముమ్మిడివరం గురుకుల పాఠశాలలో ఇటీవల పదవ తరగతి విద్యార్థిని అదృశ్యం పై ప్రిన్సిపల్ శారద తో పాటు టీచర్ లోవ కుమారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా చేయని తప్పుకు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయటం సరికాదంటూ విద్యార్థినులు మంగళవారం సాయంత్రం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ పాఠశాల నుంచి వెళ్తుండగా విద్యార్థినులు కన్నీటి పర్వతం అయ్యారు.