చర్లపల్లిలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి..!

మేడ్చల్: చర్లపల్లి పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చర్లపల్లి జైలు నుంచి ఎలక్ట్రిక్ స్కూటీపై నాగారం వైపు వెళ్తున్న ఆదర్శ్ బిశ్వాల్ (20)ను శ్రీకృష్ణ కన్వెన్షన్ సమీపానికి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడంతో ఆదర్శ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేశారు.