జాతీయ స్థాయిలో మెరిసిన శామీర్‌పేట ఠాణా
MDCL: శామీర్‌పేట ఠాణా జాతీయ స్థాయిలో మెరిసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏటా ప్రకటించే అత్యుత్తమ పనితీరులో ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. బాధితులు ఫిర్యాదు ఇవ్వగానే FIR ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, ఫిర్యాదు దారులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించడంతో ఈ గుర్తింపు వచ్చిందని ఎస్సై శ్రీనాథ్ తెలిపారు. గత ఏడాది రెండో స్థానంలో నిలిచింది.